
ఆత్మకూరు(ఎం), జూలై 1: గ్రామాలభివృద్ధితో పాటు పచ్చద నం, పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపట్టిన 4వ విడత పల్లె ప్రగతి గురువారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి పల్లె ప్రగతిలో చేపట్టే పనులను గుర్తించా రు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రధాన వీధుల వెంట, ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలన్నారు. ఆ యా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలలో మండల ప్రత్యేకాధికా రి శ్యామ్ సుందర్, ఎంపీడీవో రాములు, ఎంపీవో పద్మావతి, సర్పంచ్‌లు నగేష్, తిరుమల్‌రెడ్డి, రమేష్, ఎల్లయ్య, ఎంపీటీసీ కవితతో పాటు పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి
తుర్కపల్లి: నాల్గవ విడుత పల్లె ప్రగతిలో ప్రజలందరినీ భాగ స్వాములను చేసి విజయవంతం చేయాలని మండల ప్రత్యేకా ధికారి రహామన్, ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. నాల్గవ విడు త పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మొదటి రోజు మండల కేంద్రంతో పాటు వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, మాదాపూర్, రుస్తాపూర్, చోక్లాతండా తదితర అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని వీధుల వెంట తిరుగుతూ.. సమస్యలను గుర్తించారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మోటకొండూర్ మండలంలో
మోటకొండూర్: నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం గురువారం మండల వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ సంద ర్భంగా గ్రామగ్రామాన ప్రజాప్రతినిధులు, అధికారులు పాద యాత్రలు నిర్వహించి, సమస్యలను గుర్తించారు. అనంతరం గ్రామసభను ఏర్పాటు చేసి ప్రగతి నివేదికను చదివి వినిపిం చారు. కాటేపల్లి, ముత్తిరెడ్డిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలో మండల ప్రత్యేకాధికారిని పరిమళాదేవి పాల్గొన్ని ప్రగతి పనులను గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీ డీవో వీరస్వామి, ఎంపీవో కిషన్‌కుమార్, ఆయా గ్రామాల ఇన్చార్జిలు మండల వ్యవసాయాధికారిని సుజాత, ఆర్ఐ శ్రీని వాస్‌రెడ్డి, ఏఈవో ప్రణయ్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, సర్పంచ్‌లు శ్రీలత, రాజు, విజయ, పాండు పాల్గొన్నారు.
గ్రామాలు పరిశుభ్రంగా మారాలి
ఆలేరురూరల్: పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశు భ్రంగా మారాలని డీఎల్పీవో యాదగిరి అన్నారు. గురువారం పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని గుండ్లగూడెం గ్రామా న్ని ఆయన సందర్శించి పాత్డ ఇండ్లను తొలగింపజేశారు. కార్య క్రమంలో సర్పంచ్‌లు మహేందర్‌రెడ్డి, లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి, రాం ప్రసాద్, పద్మ, నవ్య, జయమ్మ, శ్రీశైలం తదితరులు ఉన్నారు.
పకడ్బందీగా చేపట్టాలి
రాజాపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధి కారి సాయిబాబా అన్నారు. గురువారం మండలంలోని రేణి కుంటలో పల్లె ప్రగతి నిధులతో నిర్మించిని డంపింగ్‌యార్డు షె డ్, వైకుంఠధామంతో పాటు పల్లె పకృతి వనాన్ని పరిశీలించా రు. ఆయన వెంట సర్పంచ్ బూర్గు భాగ్మమ్మ, ఎంపీడీవో రామ రాజు, ఎంపీవో దినకర్ తదితరులు ఉన్నారు.
ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి
నాల్గవ విడుత పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండలం లోని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి చేపట్టాల్సిన పను లపై ప్రణాళికలు రుపొందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ధర్మేందర్‌సింగ్, గోపిరెడ్డి, రా జు, శ్రవన్‌కుమార్, ధనలక్ష్మి, భాగ్మమ్మ, నర్సమ్మ, వెంకట్‌రెడ్డి, దేవి, విజయ, మమత, పరిమళ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
యాదగిరిగుట్ట రూరల్: గ్రామాలను ఎల్లప్పుడూ పూర్తి పరిశు భ్రంగా ఉంచుతూ, పచ్చదనం వెళ్లివిరిసేలా చూసుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందని డీపీవో సాయిబాబా, మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని గురువారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహబూబ్‌పేట లో నిర్వహించిన కార్యక్రమాన్ని డీపీవో, మండల ప్రత్యేకాధి కారి హాజరయ్యారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, గ్రామ ప్రత్యేకాధి కారి సుప్రియ, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్థులు పాల్గొన్నారు.
సమర్దవంతంగా నిర్వహించాలి
గుండాల: నాల్గవ విడుత పల్లె ప్రగతిలో భాగంగా గురువారం అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి పనులను సమర్దవంతంగా నిర్వహిం చాలని ఎంపీడీవో గార్లపాటి శ్రీనివాస్ అన్నారు. మండల కేం ద్రంలోని గ్రామసభలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో గ్రామాల ప్రత్యేక అధికారు లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.