
మోటకొండూర్, జూలై 1: జాతీయ వైద్యుల దినోత్సవం పుర స్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని గురువారం డీఎంహెచ్‌వో సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్ ఆధ్వ ర్యంలో డీఎంహెచ్‌వోను మండల వైద్య సిబ్బంది సన్మానించా రు. వైద్య వృత్తి గొప్ప వరమని, కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు మరువలేనివని డీఎంహెచ్‌వో అన్నారు. అనంత రం పీహెచ్సీలో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల ప్రక్రియను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వైద్య సి బ్బంది దేవావర, సునీత, ధనమ్మ, మహేశ్, సుధారాణి తదిత రులు పాల్గొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆన్లైన్ సదస్సు
బీబీనగర్: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బీబీ నగర్ ఎయిమ్స్‌లో గురువారం ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సి కాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణ కార్మికులపై జరుగుతున్న దాడుల గురించి ఆన్లైన్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఆరో గ్య సంరక్షణ కార్మికులపై దాడులు పెరుగుతున్నాయని, ఇండి యన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకా రం దేశవ్యాప్తంగా 75 శాతం వైద్యులు ఏదో ఒక రకమైన హిం సను ఎదుర్కొన్నారన్నారు. ఈ ధోరణి వెనుక గల కారణాలు ఆరోగ్య సంరక్షణ నిపుణుల వృత్తి పరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వక్తలు డాక్టర్, పేషంట్ల మధ్య కమ్యూనికేషన్ ఎలా మెరుగుపర్చుకోవాలో, భ విష్యత్తులో అలాంటి ఘటనలను నివారించి ఆరోగ్య సంరక్షణ కార్మికులను రక్షించడానికి చర్యలను వివరించారు. ఈ సదస్సు లో న్యాయవాదులు సహా 3వేల మంది ప్రతినిధులు పాల్గొన్నా రు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ నారంగ్, మెడికల్ సూపరింటెం డెంట్ డా. నీరజ్ అగర్వాల్, డాక్టర్లు ప్రజ్ఞేశ్, యుదుకుల్, ప్ర శాంత్, దివ్యారెడ్డి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ సీహెచ్‌సీలో
చౌటుప్పల్: డాక్టర్స్‌డేను స్థానిక సీహెచ్‌సీలో గురువారం ఘ నంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్లను వైద్య సిబ్బం ది సన్మానించారు. కార్యక్రమంలో డీఎల్వో డా. పాపారావు, సూపరింటెండెంట్ డా.అలివేలు, వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్లు యశోద, సుమన్ కల్యాణ్, కాటంరాజు పాల్గొన్నారు.
ఆలేరులో
ఆలేరు టౌన్: డాక్టర్స్‌డే సందర్భంగా ఆలేరులో గురువారం డా.మురళి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో శారాజీపేట మెడిక ల్ ఆఫీసర్ శ్రవణ్‌కుమార్, మధు, మోహన్‌రెడ్డి, రమేశ్, శ్రీకాం త్, మధుకర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.
రాజాపేటలో
రాజాపేట: వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని గురువా రం మండల కేంద్రంలోని గ్రామీణ వైద్యులను ఎస్సై శ్రీధర్రె డ్డి, కెమిస్టు డ్రగిస్ట్ జిల్లా ఈసీ మెంబర్ నంగునూరి కృష్ణమూర్తి గుప్తా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, ప్రవీణ్ కుమార్, జశ్వంత్, జ్ఞానేందర్, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో
ఆత్మకూరు(ఎం): అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సంద ర్భంగా గురువారం మండల కేంద్రంలో గ్రామీణ వైద్యులను రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం దశ రథగౌడ్ సన్మానించారు. మండల వైద్యాధికారి సృజణను పం చాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నగేశ్, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ నవ్య, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీని వాస్రెడ్డితో పాటు వార్డు సభ్యులు, అఖిల పక్ష పార్టీల నాయకు లు , మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రామన్నపేటలో
రామన్నపేట: సమాచారహక్కు రక్షణ చట్టం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ దవాఖానలో డాక్టర్స్‌ను స న్మానించారు.కార్యక్రమంలో డాక్టర్లు వెంకటేశ్వర్లు, రవికుమా ర్, పురుషోత్తం, స్వాతి, నిఖిల, స్రవంతి, కమిటీ సభ్యులు సు ధాకర్, మల్లేశం, ఉపేందర్, ధర్మనీల, నగేశ్, మత్స్యగిరి తది తరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురంలో
సంస్థాన్ నారాయణపురం: డాక్టర్స్ డే సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న వై ద్యులను, సిబ్బందిని రహీం షరీఫ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రేష్మ, సంతోష, మేరీ, రాము నాయక్ పాల్గొన్నారు.
వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో
భువనగిరి అర్బన: డాక్టర్డే సందర్భంగా పట్టణంలోని డాక్టర్ వేముల రాజ్‌కుమార్, వివేకానంద, పవన్‌లను వాసవీ క్లబ్ ఆ ధ్వర్యంలో స్థానిక కన్యకాపరమేశ్వరీ దేవాలయం ఆవరణలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చికటి మల్ల రాములు, కార్శదర్శి ఆకుల రమేశ్, సభ్యులు రుషికేశ్, పాలకుర్తి వేణుమాధవ్ పాల్గొన్నారు.