మోటకొండూర్, జూన్ 6 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లోని ప్రజలతో ఎప్పటికప్పుడు చర్చించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను పార్టీ నాయకులు తిప్పికొట్టాలన్నారు. సోమవారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లోని చెరువులను నింపేందుకు మా ఊరు-మా చెరువు కార్యక్రమం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులను భాగస్వాములను చేయాలన్నారు. అనంతరం విదేశీ పర్యటన పూర్తి చేసుకుని గ్రామానికి వచ్చిన ప్రభుత్వ విప్‌ను పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాటేపల్లిలో శివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ ఎర్ర మల్లేశ్‌యాదవ్, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, సర్పంచులు మంత్రి రాజు, చామకూర అమరేందర్‌రెడ్డి, వేముల పాండు, పైళ్ల వినోద, బీసీ సెల్ అధ్యక్షుడు గౌరయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోడ మహేశ్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ పన్నీరు భరత్, నాయకులు గుర్రాల రవి, శ్రీను, కొప్పుల శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులుయాదవ్, స్కైలాబ్‌రెడ్డి, పాండురంగారెడ్డి, భాస్కర్, కొమురయ్య, శ్రీధర్‌రెడ్డి, నాగిరెడ్డి, సిద్ధులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మోటకొండూర్ : మండలంలోని చందేపల్లికి చెందిన మల్లయ్యకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.55వేల చెక్కును లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. నిరుపేదల ఆరోగ్య ఖర్చుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి వారికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఆత్మకూరు(ఎం): మండలంలోని రాఘవాపురానికి చెందిన కాటం యాదయ్యకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.50 వేల చెక్కును సోమవారం మోటకొండూరు మండలం కాటపల్లిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అందజేశారు. ఆమె వెంట టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దొండ పురుషోత్తంరెడ్డి, మండల నాయకుడు బొక్క వెంకట్‌రెడ్డి ఉన్నారు.