ఆలేరు రూరల్, ఏప్రిల్ 8 : అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మంతపురి, పటేల్‌గూడెం గ్రామంలో సీసీరోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంతపురిలో రూ.90లక్షలతో బీటీరోడ్డు మంజూరు చేయించగా, రూ.30లక్షలతో గుడికుంట చెరువుకు మరమ్మతులు చేయించామన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. దేశంలో 29రాష్ట్రాలు ఉండగా తెలంగాణలో మాత్రమే కరెంట్‌కు కోతలు లేవన్నారు. మూడేండ్లుగా ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏవిధంగా ఉద్యమించామో వరి ధాన్యం కొనుగోలు చేసేదాక కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాలం చేసిన రైతు కుటుంబానికి రైతుబీమాతో వారం రోజుల్లో రూ.5లక్షలు ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం కేసీఆర్ జిల్లాలోనే అన్ని గ్రామపంచాయతీలకు రూ.25లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, సర్పంచ్ పులుగం పద్మాయాదిరెడ్డి, పారుపల్లి లావణ్యనర్సింహులు, పీఏసీఎస్ డైరెక్టర్లు గవ్వల నర్సింహులు, మారుపల్లి భిక్షపతి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కోటగిరి పాండరి, మాజీ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పిక్క శ్రీనివాస్, ఎంపీటీసీ ఆరె ప్రశాంత్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కాసగల్ల అనసూయ, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కోటగిరి ఆంజనేయులు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దంతూరి పరుశరాములు, మధు, వెంకటపాపిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
సుశృత గ్రామీణ వైద్యసేవలు ఎంతో ప్రాముఖ్యం
భువనగిరి అర్బన్ : సుశృత గ్రామీణ వైద్య సేవలు ఎంతో ప్రాముఖ్యమని ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక రావిభద్రారెడ్డి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన సుశృత గ్రామీణ వైద్యుల జిల్లా ఐదో మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో గజ్వేల్ జడ్పీటీసీ వంగ మల్లేశ్, ఆర్ఎంపీ, పీఎంపీల రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా సుశృత గ్రామీణా వైద్యులు పాల్గొన్నారు.