ఆత్మకూరు(ఎం), మార్చి 9: మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లను ఎస్ఐ మధుతోపాటు సిబ్బంది సన్మానించారు. అదేవిధంగామండలంలోని తుక్కాపురం ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్‌తోపాటు ఉపాధ్యాయులను సర్పంచ్ దయ్యాల రాజు సన్మానించారు.
పారిశుధ్య కార్మికులకు…
బీబీనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పంజాల సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికులకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు రామాంజనేయులు, నెదునేరి ముఖేశ్, పంజాల సదానంద్‌గౌడ్ పాల్గొన్నారు.
మహిళలకు..
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని పీపల్‌పహాడ్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పనిచేస్తున్న గ్రామ మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దోసపాటి జ్యోతి, ప్రధానోపాధ్యాయుడు కమలాకర్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ నూనె వెంకటేశం పాల్గొన్నారు.