
రామన్నపేటలో ఘనంగా బోనాల పండుగ
ముత్యాలమ్మతల్లికి గ్రామపంచాయతీ నుంచి ప్రత్యేక బోనం
రామన్నపేట, ఆగస్టు 26: ముత్యాలమ్మ బోనాల పండుగను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సర్పం చ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ గ్రామ పంచాయతీ తరఫున సర్కారు బోనాన్ని వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించి డప్పుచప్పులతో ఊరేగింపుగా తీసుకెళ్లి ముత్యాలమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నకిరేకంటి మొగలయ్య, ఆకవరపు మధుబాబు, వార్డు సభ్యులు లవణం రాధికారాము, గొలుసుల ప్రసా ద్, లగ్గోని యాదయ్య, ఏటెల్లి సునీతాశ్రీనివాస్, గాదే నరేందర్, బందెలరాములు, ఊట్కూరి నర్సింహ, కందు ల హన్మంతు, సాల్వేరులింగం, వనం భిక్షపతి, కొమ్ముశేఖర్, ఆముద లక్ష్మణ్, లవణం ఉపేందర్, వనం అంజ య్య వీరమల్ల వెంకటయ్య పాల్గొన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు, ఆగస్టు26: ప్రతి ఏటా శ్రావణమాసంలో జరుపుకొనే బోనాల పండుగను మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజలు ఘనంగా నిర్వహించారు. గురువారం ముత్యాలమ్మకు మహిళలు బోనాలను ప్రదర్శన తీసుకెళ్లి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జైకేసారం గ్రామంలో..
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు26: మండల పరిధిలోని జైకేసారం గ్రామంలో కురుమ కులస్తులు బోనాల పండుగ ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు.తర్వాత బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం బీరప్ప ఆలయంలో స్వామివారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.