
కలెక్టర్ పమేలాసత్పతి
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని గదులను పూర్తిస్థాయిలో శుభ్రపర్చాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం ఆమె యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి పాఠశాలలోని గదులతోపాటు పరిసరాలను పరిశుభ్రం గా ఉంచాలని అధికారులను ఆదే శించారు. పాఠశాలలో గ్రామ పం చాయతీ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుధ్య పనులు, తరగతి గదుల శుభ్రత, ఇతర వసతులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని రైతువేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతువేదికను సక్రమంగా నిర్వహించాలని, ప్రాంగణం లో మొక్కలను నాటాలన్నారు. అనంతరం ఆమె పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి ఖాళీగా ఉన్న స్థలాల్లో పూల మొక్కలు, ఇతర మొక్కలను నాటాలని అధికారులకు సూచించారు. వీటితోపాటు గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించి వాటి నిర్మాణ వివరాలను ఆర్అండ్బీ ఏఈని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీశైలం, జడ్పీటీసీ అనురాధ, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ కానుగు కవిత, ఉపసర్పంచ్ రేపాక స్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ కన్నెగంటి సుప్రియ, ఎంపీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి కిశోర్‌కుమార్ రెడ్డి, ఏఈవో శ్రావ్య పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 నుం చి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యం లో ఈ నెల 30వ తేదీలోగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టాలని, పాఠశాలల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం ఆమె భువనగిరి పరిధిలోని సింగన్నగూడెంలో ఆకస్మికంగా పర్యటించి అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. అన్ని మౌలిక సదుపాయాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.