
ఆత్మకూరు(ఎం), జూన్ 9 : ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలతో పాటు ఎరు వులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎరువు ల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట ఏడీఏ వెంకటేశ్వర్రావు, ఏవో శ్రీనివాస్‌తో పాటు దుకా ణం నిర్వాహకులు ఉన్నారు.
రాజాపేట: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్య లు తప్పవని భువనగిరి ఏడీఏ దేవ్‌సింగ్ అన్నారు. బుధవా రం మండల కేంద్రంలో విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల స్టాక్ వివరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏవోలు మాధవి, ఖాన్ తదితరులు ఉన్నారు.
టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో బుధవారం వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ టీమ్ సభ్యులు సీఐ శ్రీనివాస్ , ఏవో నాగరాజుతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న స్టాక్‌ను పరిశీలించారు. నాసిరకమైన ఎరువులు, విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏడీఏ నీలిమ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.