యాదాద్రి భువనగిరి : నెల రోజులుగా నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మహిళలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఒకటవ వార్డు బస్టాండ్ వెనుక కాలనీలో ప్రజలకు వాటర్ సప్లై లేక నెల.. రోజులు అవుతున్న పట్టించుకునే నాధుడే లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీరా గ్రామపంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని తెలుపగా వారు చెక్ చేయగా పైప్ లైన్ పాడైపోయిందని తెలిపారు. 120 మీటర్ల పైప్ లైన్ దానికి కావాలని గ్రామపంచాయతీలో నిధులు లేక పైపు వేయలేక పోతున్నామని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వార్డు మహిళలు మాట్లాడుతూ..నెల రోజులుగా నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు స్పందించి మాకు నీళ్లు ఇప్పించాలిని కోరారు. స్థానిక ఎమ్మెల్యే సమస్యను పరిష్కారం చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్వప్న, బాలమణి, సత్తెమ్మ, లచ్చమ్మ, రమ్య, మంజుల, మంగమ్మ, రజిత, అనిత,చెండెమ్మ, విజయలక్ష్మి, రాజిరెడ్డి, చంద్రమౌళి గౌడ్, నరసయ్య, కిష్టయ్య, విశ్వనాథం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.