– పోలీస్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు
బీబీనగర్, అక్టోబర్ 23 : తనపై బీబీనగర్ ఎయిమ్స్ సిబ్బంది దాడి చేశారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్ల, శ్రీనివాస్‌నగర్‌కు చెందిన తేజావత్ విజయ అనారోగ్యంతో బాధపడుతు వైద్యం చేయించుకోవడానికి బుధవారం మధ్యాహ్నం ఎయిమ్స్‌కు వచ్చింది. ఆస్పత్రిలో ఓపి తీసుకుంటుండగా కౌంటర్లో ఉన్న ఓపి ఆపరేటర్ అకారణంగా తనను బూతులు తిట్టాడని, సెక్యూరిటీని పిలిచి బయటకు నెట్టివేశారని, అక్కడ ఉన్న మహిళా సెక్యూరిటీ తనను కొట్టిందని తెలిపింది. తనపై అకారణంగా దాడి చేసిన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుని న్యాయం చేయాలని కోరుతూ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధిత మహిళ తెలిపింది.