భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 06 : స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థులైన, గెలిచే అభ్యర్థులను ఎన్నుకోవాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టిగా కృషి చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. పోచంపల్లి మండలంలో 100 శాతం ఎంపీటీసీ, సర్పంచులు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన పర్యటించి ఎన్నికల తర్వాతే ఇంటికి వెళ్తానని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులను ఖరారు చేయాలని, వారి గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అసత్య ప్రచారం చేస్తూ పూట గడుపుతుందని, రెండు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి శూన్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి, సీత వెంకటేశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, నాయకులు సామ రవీందర్ రెడ్డి, రావుల శేఖర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం, చిలువేరు బాల నరసింహ, బందారపు లక్ష్మణ్, గునిగంటి మల్లేష్ గౌడ్, సార బాలయ్య, సీత శ్రవణ్, కలుకూరి శ్రీకాంత్, పర్వతం అశోక్, కర్నాటి అంజమ్మ, గుండు రాజమణి, పగిళ్ల రాంరెడ్డి, పగిళ్ల సుధాకర్ రెడ్డి, మన్నె పద్మారెడ్డి, మక్బూల్ పాల్గొన్నారు.
Bhoodan Pochampally : గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి