యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట దేవస్థానం క్షేత్ర పాలకుడిగా కొలువబడుతున్న శ్రీ ఆంజనేయస్వామికి మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి 108 వెండి తమలపాకులను బహుకరించారు.
ఈ సందర్భంగా శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.