Rachakonda CP | బీబీనగర్, ఫిబ్రవరి 18 : మండలంలోని పడమటి సోమవారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించారు. ఈ నెల 24 నుండి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత కల్పిస్తామన్నారు.
బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు పోలీసులకు సహకరించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు సుమారు రెండు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని..ఈ నేపథ్యంలో అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నరేందర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు సంధి గారి బసవయ్య, నాయకులు బొమ్మకొని బస్వయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు