రాజాపేట, జూలై 16 : ఆలేరు నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం రాజాపేట మండలంలోని పిట్టలగూడెం, సోమారం, బొందుగుల, పారుపల్లి, బూరుగుపల్లి జాల, కొత్తజాల, సింగారం, మల్లెగూడెం గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ వారం రోజుల్లో రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్య్రకమంలో మదర్ డైరీ డైరెక్టర్ గొల్లపల్లి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలరాజు గౌడ్, విట్టల్ నాయక్, బుడిగె పెంటయ్య గౌడ్, మోత్కుపల్లి ప్రవీణ్, రాపోలు లక్ష్మిరెడ్డి, గౌర బక్కులు, పాండవుల భాను ప్రకాశ్ గౌడ్, బల్ల యాదేశ్, ఐరేని నవీన్ కుమార్ పాల్గొన్నారు.