భువనగిరి, జూన్ 11 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలో మండల అధ్యక్షుడు చిర్కా సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భువనగిరి మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. 11 ఏండ్ల పాలనలో ఎన్నో సాహసోపతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. గత ఏడు దశాబ్దాల్లో చేయని విధంగా దేశానికి సేవ చేసినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలులు దిశగా కార్యకర్తలందరూ పనిచేయాలని మార్గ నిర్దేశం చేశారు. అనంతరం మండల కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా తోటకూరి అశోక్ యాదవ్, వెంకటేశ్ నాయక్, ప్రధాన కార్యదర్శులుగా నాగు వినోద్ కుమార్, మాటూరు అనిల్ గౌడ్, కార్యదర్శిగా జ్ఞానేశ్వర్ ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శ్యాంసుందర్ రెడ్డి, వడ్డెర వెంకటేశ్, వెంకటేశ్ నాయక్, బబ్బురి సురేశ్, వైజయంతి, మాటూరి అనిల్ గౌడ్, క్యాసని శ్రీనివాస్, మట్ట ఆంజనేయులు, నల్లమస శేఖర్, బుగ్గ దేవేందర్, బూరుగు మణికంఠ, మాణిక్యం రెడ్డి, ఉపేందర్, గణేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.