చౌటుప్పల్, నవంబర్ 28 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేసి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఎండగట్టాలన్నారు. అంతేకాకుండా ఈ నెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి, మాజీ సర్పంచ్ సుర్వి మల్లేశ్ గౌడ్, నాయకులు కొత్త పర్వతాలు యాదవ్, చిన్నం బాలరాజు, వాకిటి భూపాల్ రెడ్డి, కొండ యాదగిరి, మెట్టు మహేశ్వర్ రెడ్డి, తూర్పునూరి మల్లేశ్ గౌడ్, బాతరాజు యాదగిరి, భీమనగోని మల్లేశం గౌడ్, సురుకంటి శంకర్ రెడ్డి, సమీరెడ్డి జనార్దన్ రెడ్డి, దొడ్డి మల్లేశ్ పాల్గొన్నారు.