రాజాపేట, ఏప్రిల్ 22 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొండ్రెడ్డి చెరువులో తాగునీటి సమస్య నెలకొంది. బిందెడు నీటి కోసం పబ్లిక్ నల్లాల వద్ద మహిళలు పడిగాపులు కాస్తున్నారు. గ్రామానికి తాగునీరు అందించే బోర్ల మోటార్లు చెడిపోవడంతో పాటు మూడు రోజులకు ఒకసారి వచ్చే మిషన్ భగీరథ నీళ్లు సరిపోడ రాకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు చెడిపోయిన బోరు మోటార్లకు మరమ్మతులు చేపట్టి తాగునీటి ఇబ్బంది తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.