యాదగిరిగుట్ట, జూన్ 10 : బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుంగబాలు జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా జరిగాయి. తుంగ బాలుకు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని ఆయన నివాసంలో బాలును శాలువాతో ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో ఆయన యాదగిరిగుట్ట శ్రీలక్షీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వైకుంఠ ద్వారం వద్ద కేక్‌ను కట్ చేశారు.
ఈ వేడుకలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పార్టీ పట్టణాధ్యక్షుడు పాపట్ల నరహరి పాల్గొని తుంగ బాలును శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారెడ్డి కొండల్‌రెడ్డి, గుణగంటి బాబురావు, యువజన విభాగం నాయకులు జడల యశీల్గౌడ్, పల్లె సంతోశ్‌గౌడ్, నాయకులు పేరబోయిన సత్యనారాయణ, కొన్యాల నర్సింహారెడ్డి, ముక్యర్ల సతీశ్, కల్వకొలను సతీశ్భట్, ర్యాకల రాజు పాల్గొన్నారు.
Yadagirigutta : ఘనంగా తుంగ బాలు జన్మదిన వేడుకలు