ఆలేరు టౌన్, ఏప్రిల్ 19 : ఆలేరు పట్టణానికి చెందిన కళాసికం సుజనా తెలంగాణ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం మొదటిసారి ఆలేరుకు విచ్చేయడంతో ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని కళాసికం శ్యామ్ గృహంలో సభ్యులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు, ఫిజికల్ డైరెక్టర్ పూల నాగయ్య మాట్లాడుతూ.. ఆలేరు పట్టణానికి చెందిన కళాసికం సుజనా చిన్నతనం నుంచి కష్టపడి చదివి హైకోర్టు జడ్జిగా ఎదగడం ఆలేరు ప్రాంతానికే గర్వకారణం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్వర్లు, కోశాధికారి బొమ్మల మల్లేశం ప్రధాన కార్యదర్శి కళాసికం శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయకుమార్, భాస్కర్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ మాదాసు జోసెఫ్, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు శ్రీనివాస్, ఫ్రెండ్స్ క్లబ్ సహాయ కార్యదర్శి పూల చంద్రకుమార్, క్లబ్ సభ్యుడు యాట సందీప్, సోదరి రోజా పాల్గొన్నారు.