యాదగిరగుట్ట, మార్చి24 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని సోమవారం త్రిపుర రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఈఓ భాస్కర్ రావు వారికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.