బీబీనగర్, అక్టోబర్ 22 : టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ట్రైనీ ఎంపీడీఓలు బీబీనగర్ మండలంలోని అన్నంపట్ల గ్రామాన్ని బుధవారం సందర్శించారు. శిక్షణలో భాగంగా ట్రైనీ ఎంపీడీఓలకు గ్రామ పంచాయతీ నిర్వహించే అన్ని రకాల రికార్డులు, గ్రామ పరిపాలన అంశాలు, సెర్ప్ విభాగంలో డాక్రా సంఘాలు, లోన్లు, ఎస్హెచ్జీలు, రికార్డుల నమోదు, ఇజీఎస్ విభాగంలో నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సోక్ పిట్స్, వివిధ గవర్నమెంట్ వెబ్సైట్ల గురించి అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ సోక్ పిట్స్, డంపింగ్ యార్డు, నర్సరీతో పాటు పలు అభివృద్ది పనులను చూపించి గ్రామ స్థాయిలో అభివృద్ది విధుల నిర్వహణ ఎలా ఉంటుందో వివరించారు.
రికార్డుల నమోదు, అభివృద్ధిపై అధికారులు ఏ అంశాలపై దృష్టి సారించాలనే వివరాలను తెలియజేశారు. అదే విధంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విధులు, బాధ్యతలు, మండల పరిపాలనపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, ఏపీడీ సురేశ్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, టీజీఐఆర్డీ ఫ్యాకల్టీ కె.అనిల్ కుమార్, భూదాన్ పోచంపల్లి ఎంపీఓ మజీద్, బీబీనగర్ ఎంపీఓ వినూత్న, ఏపీఓ మీన, ఏఈఈ పీఆర్ రాకేశ్ కుమార్, పంచాయతి కార్యదర్శులు పంజాల బాలలక్ష్మి, షేక్ జుబేర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Bibinagar : గ్రామ, మండల పరిపాలనపై ట్రైనీ ఎంపీడీఓలకు అవగాహన
Bibinagar : గ్రామ, మండల పరిపాలనపై ట్రైనీ ఎంపీడీఓలకు అవగాహన