భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 12 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు బీబీనగర్, భువనగిరికి వెళ్లేందుకు పెద్ద రావులపల్లి, బట్టుగూడం మీదుగా సుమారు 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. మూసీ వరద నీటికి గుర్రపు డెక్క ఆకుతో పాటు చెత్తా చెదారం, వ్యర్థ పదార్థాలు కొట్టుకొస్తున్నాయి. బ్రిడ్జి వద్ద భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. మూసీ బ్రిడ్జి వద్ద పరిస్థితిని పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
Bhoodan Pochampally : ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ.. స్తంభించిన రాకపోకలు