ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో మూడో విడత అడ్మిషన్లు
భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 2025-26 ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు...
భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 2025-26 ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ నెల 27, 29, 30 తేదీల్లో నేరుగా అడ్మిషన్ ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.కే శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆయా రోజుల్లో ఉదయం 6 గంటల వరకు కళాశాలకు చేరుకోవాలని, ఎంపిక ప్రక్రియ, అడ్మిషన్ల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని తెలిపారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి, ఉత్తీర్ణత సాధించి ఉండాలని అభ్యర్థి కనీస ఎత్తు 152 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని, ఎలాంటి కంటి దోషములు, ఆనారోగ్య సమస్యలు ఉండరాదని పేర్కొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారని, అభ్యర్థులు అందుకు అనుకూలంగా ఉండేలా ట్రాక్ ప్యాంటు, టీ-షర్ట్, షూస్ ధరించి రావాలని, అన్ని సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

