కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర ద్వారా మొత్తం రూ.32,02,697 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో వెంకటయ్య తెలిపారు. ఐదు రోజులపాటు జరిగిన జాతర ముగిసిన అనంతరం సోమవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో...
– గతేడాది కంటే రూ.2,92,311 అధిక ఆదాయం
కారేపల్లి, అక్టోబర్ 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర ద్వారా మొత్తం రూ.32,02,697 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో వెంకటయ్య తెలిపారు. ఐదు రోజులపాటు జరిగిన జాతర ముగిసిన అనంతరం సోమవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,92,311 అధిక ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు. జాతరలో హుండీ ద్వారా రూ.8,02,366 ఆదాయం రాగా, ద్విచక్ర వాహన పూజల ద్వారా రూ.2,12,000, పెద్ద వాహన పూజల ద్వారా రూ.2,23,000, గోత్ర నామార్చన ద్వారా రూ.1,02,520, కుంకుమార్చన ద్వారా రూ.96,830, స్థలాల అద్దెల ద్వారా రూ.5,09,300, విరాళాల రూపంలో రూ.4,131 ఆదాయం సమకూరింది.
వాహన పూజల అయ్యగార్లకు రూ.1,00,000, చీరల విక్రయం ద్వారా రూ.56,550 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వేలం పాట హక్కుల ద్వారా కొబ్బరికాయలు, పూజా సామగ్రికి రూ.5,01,000, లడ్డూ, పులిహోర విక్రయాలకు రూ.1,75,000, మిఠాయిలకు రూ.1,43,000, పుట్నాలకు రూ.51,000, కొబ్బరి చిప్పలకు రూ.1,83,000, ఐస్‌క్రీమ్‌లకు రూ.43,000 ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్సా ట్రస్ట్, కోట మైసమ్మ దేవాలయ చైర్మన్ పర్సా పట్టాభిరామారావు, దేవాదాయ శాఖ పరిశీలకురాలు సరిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి నిరంజన్, దేవాదాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

