Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సువర్ణావకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా స్టేషన్ మాస్టర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ వివరాలు..
రైల్వే పరీక్షల చరిత్రలో తొలిసారి స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియను NTPC రిక్రూట్మెంట్ నుంచి RRB వేరు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1250 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ రేపటి (అక్టోబర్ 27) నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 25తో ముగుస్తుంది.
పోస్టు
స్టేషన్ మాస్టర్. ఈ పోస్టులను RRBలు అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పుర్, చండీఘర్, చెన్నై, గోరఖ్‌పుర్, జమ్మూ-శ్రీనగర్, కోల్‌కతా, మాల్డా, ముంబై, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురంలలో నింపుతారు. ఖాళీలు త్వరలో ప్రకటిస్తారు.
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
2027, జనవరి 1 నాటికి అభ్యర్థుల కనీస వయసు 20 ఏండ్లు, గరిష్ఠ వయసు 30 ఏండ్లు ఉండాలి. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.

Posts
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
CBT 100 మార్కులకు ఉంటుంది. 120 నిమిషాల్లో రాయాలి. దీనిలో బేసిక్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ అనలిటికల్ క్యాపబిలిటీ (60), లాజికల్ క్యాపబిలిటీ (రీడింగ్ కాంప్రహెన్షన్) 20, మెంటల్ రీజనింగ్ 20 ప్రశ్నలు ఇస్తారు.
CBTలో మెరిట్ ఆధారంగా CBATకి పిలుస్తారు. ఇది సంబంధిత RRBలోని ప్రతి ఖాళీకి సుమారు 8 మందిని ఎంపిక చేస్తారు.
మెడికల్ స్టాండర్డ్‌లో దూరం చూపు 6/9, దగ్గరి చూపు Sn- 0.6 ఉండాలి.
ఫీజు
దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు రూ. 250.
జీతం
ఎంపికైనవారికి జీతం నెలకు రూ. 35,400 (పే లెవల్ 6) ఇస్తారు.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ రేపటి (అక్టోబర్ 27) నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 25తో ముగుస్తుంది. ఈ తేదీలు మారవచ్చు లేదా అంతే ఉండవచ్చు. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ https://rrb.indianrailways.gov.inలో చూడవచ్చు.

Station Master
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

