Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
Vice President | భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల: భారత ఉప రాష్ట్రపతి(Vice President ) సి.పి. రాధాకృష్ణన్ ( Radha Krishanan) సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
ధ్వజస్తంభానికి ఉప రాష్ట్రపతి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి వారిని కూడా అనంతరం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు రాష్ట్ర,జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

