Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
Boy Fakes Kidnap | ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయిన ఒక యువకుడు డబ్బులు పొగొట్టుకుని అప్పులపాలయ్యాడు. దీంతో తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు కిడ్నాప్ నాటకం ఆడాడు. మరింత ఒత్తిడి పెంచేందుకు కిడ్నాపర్లు అతడ్ని చంపేసినట్లు వాయిస్ మెసేజ్‌లు పంపాడు.
లక్నో: ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయిన ఒక యువకుడు డబ్బులు పొగొట్టుకుని అప్పులపాలయ్యాడు. దీంతో తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆందోళన చెందిన తండ్రి రూ.3 లక్షలు సమకూర్చాడు. మరింత ఒత్తిడి పెంచేందుకు కిడ్నాపర్లు అతడ్ని చంపేసినట్లు వాయిస్ మెసేజ్‌లు పంపాడు. (Boy Fakes Kidnap) దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడు తన ప్రియురాలితో ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల యవకుడు నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఆన్లైన్ గేమింగ్‌కు అతడు బానిసయ్యాడు. గతంలో రూ. 70,000 కోల్పోగా ఆ డబ్బును కుటుంబం చెల్లించింది. అయినప్పటికీ ఆ యువకుడు ఆన్లైన్ గేమ్స్ కొనసాగించాడు. మరోసారి రూ. 50,000 పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని పదేపదే అతడు డబ్బులు అడగటంతో వారు ఇవ్వడం మానేశారు.
కాగా, ఆన్లైన్ గేమ్స్ వల్ల అప్పులపాలైన ఆ యువకుడు, ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసే తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. అక్టోబర్ 20న రాత్రి 9 గంటల తర్వాత లక్నోలోని ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. మొబైల్ ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసేశాడు. ఆ తర్వాత వై ఫై ద్వారా వాట్సాప్‌లో తల్లి, తండ్రి, బంధువుకు కిడ్నాప్ సందేశం పంపాడు. కొద్దిసేపటికే రూ.5 లక్షలు డిమాండ్ చేస్తూ వేరొకరి గొంతుతో వాయిస్ నోట్ పంపాడు. కొడుకు భద్రత గురించి ఆందోళన చెందిన తండ్రి రూ. 3 లక్షలు ఏర్పాటు చేశారు.
అయితే కుటుంబాన్ని మరింత ఒత్తిడి చేసేందుకు కిడ్నాపర్లు అతడ్ని చంపేసినట్లు మళ్లీ వాయిస్ నోట్ పంపాడు. దీంతో ఆందోళన చెందిన యువకుడి తల్లి, లక్నోలోని పారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు ఆ యువకుడే కిడ్నాప్ నాటకం ఆడినట్లు సాంకేతిక ఆధారాలతో తెలుసుకున్నాడు. ప్రియురాలితో ఉన్న అతడ్ని గుర్తించి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు సేఫ్‌గా ఉన్నట్లు అతడి కుటుంబానికి సమాచారం అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

