రాజాపేట, ఏప్రిల్ 14 : వసంత కాలం.. ప్రకృతి పునరుజ్జీవనానికి నిదర్శనం. ఈ కాలంలో మోడు వారిన చెట్లు తిరిగి ప్రాణం పోసుకుంటాయి. కొంగత్త చిగుర్లతో పచ్చందాలను వెదజల్లుతూ ప్రకృతి ప్రేమికులకు, చూపరులకు హాయిని గొలుపుతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని రావి చెట్టు ఇందుకు నిదర్శనంలా దర్శనమిస్తుంది. దాదాపు ఏడున్నర దశాబ్దాల వయస్సున్న ఈ చెట్టు ఇటీవల పూర్తిగా ఆకులు రాల్చి మోడుగా మారింది. మళ్లీ పది రోజులకే పచ్చగా చిగురించి చల్లని నీడనిస్తుంది. దీంతో ఉష్ణ తాపాన్ని తాళలేని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెట్టు కింద హాయిగా కాసేపు సేద తీరుతున్నారు.
Rajapet : ప్రకృతి పునరుజ్జీవనానికి నిదర్శనంలా ‘బోధి వృక్షం’