రాజాపేట, ఏప్రిల్ 12 : మహానీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బొందుగులలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డితో కలసి రిలీజ్ యూత్ సభ్యులు నెలకొల్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. మహనీయుల చరిత్ర భావితరాలకు అందించేందుకు విగ్రహాలు నెలకొల్పడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, డీఎస్పీ రవికుమార్, జూకంటి ప్రవీణ్, కొమ్ము చంద్రయ్య, కొమ్ము పాండు, విగ్రహ దాత కొమ్ము ఉపేందర్, పెంటయ్య గౌడ్, మోత్కుపల్లి ప్రవీణ్, గంధమల నరసింహులు, సట్టు తిరుమలేశ్, గొల్లూరి అశోక్, గొల్లూరి ప్రభాకర్, కొమ్ము ప్రకాశ్, కొండూరి స్వామి, ఇంజ మహేశ్, గొల్లూరి స్వామి పాల్గొన్నారు.
Rajapet : మహనీయుల ఆశయాలు సాధించాలి : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య