బీబీనగర్, మే 20 : ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, విద్యార్దులకు నూతన పద్దతుల ద్వారా భోదించాలని వయోజన విద్య డైరెక్టర్ ఉషారాణి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలాపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణా శిభిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ భోధనా విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ విద్యార్దులకు బోధించాలన్నారు. విద్యార్దుల అభ్యసన సామర్ద్యాలను మెరుగుపర్చాలని, లోపాలను సరిచేస్తూ శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణా శిభిరంలో 134 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.సత్యనారాయణ, ఎంఈఓ జి.సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.