భూదాన్ పోచంపల్లి, జూలై 22 : భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సాంకేతిక శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎన్.వి.హరికృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థలో రెండు నెలల కాల పరిమితితో కూడిన ఎకౌంట్ అసిస్టెంట్, ట్యాలీ ప్రైమ్ (బీకాం పాస్), బేసిక్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్వేర్ (ఇంటర్ పాస్), అడ్వాన్స్ వెల్డింగ్, ఆటోమొబైల్ ఈవీ, టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ (ఎస్ఎస్సీ పాస్) కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 18 నుండి 25 సంవత్సరాల లోపు గల విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫొటోలతో హాజరు కావాలన్నారు. ఈ నెల 27న అడ్మిషన్లకు చివరి తేదీ అని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులకు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పించబడుతుందని పేర్కొన్నారు. వివరాలకు సెల్ నెంబర్ 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లను సంప్రదించాలని సూచించారు.