భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 28 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో కమ్యూనిటీ సోక్‌పిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ హౌసింగ్ పథకం లబ్ధిదారుల గృహాలను సందర్శించి, వారి సమస్యలు, తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ గౌడ్, ఏపీఓ కృష్ణమూర్తి, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిర, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి నరేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ అమృత, కారోబార్ భార్గవి, పాఠశాల ఉపాధ్యాయులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : జడ్పీ సీఈఓ శోభారాణి