చౌటుప్పల్, ఏప్రిల్ 21 : లయన్స్ ఇంటర్నేషనల్ 320E డిస్ట్రిక్ట్ జోన్ చైర్మన్‌గా చౌటుప్పల్ విద్యానగర్‌కు చెందిన పోలోజు శ్రీనివాసాచారి ఎన్నికయ్యారు. నల్లగొండలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో లయన్స్ జిల్లా గవర్నర్ మదన్మోహన్ రేపాల ఈ ఎన్నికను ప్రకటించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్‌లో శ్రీనివాసాచారి 2015లో సభ్యుడిగా చేరారు. ఇప్పటివరకు క్లబ్ కోశాధికారిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. లయన్స్ డిసి మెంబర్ గానూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ జోన్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సాంస్కృతిక కార్యదర్శిగా, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం డైరెక్టర్ గా, శ్రీ పెరుమాళ్ల ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసాచారి ఎన్నికై వివిధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తన నియామకంపై డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్మోహన్ రేపాల, లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.