రామన్నపేట : నిదానపల్లి గ్రామ పరిధిలోని మల్లన్న గుట్ట(చిన్న శ్రీశైలం)పై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు అందించి కళ్యాణంలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు సత్యనారాయణ శాస్త్రి సిద్ధాంతి బృందం ఆధ్వర్యంలో రాత్రి 11 గంటల 40 నిమిషాలకు వైభవంగా మల్లికార్జున స్వామి కల్యాణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల భిక్షం యాదవ్, రామన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, నాయకులు మేడి రవిచంద్ర, గంగుల వెంకట రాజిరెడ్డి, కొండ బుచ్చిబాబు గౌడ్, మందడి ప్రభాకర్ రెడ్డి, పూస బాలకిషన్, గోదాసు పృథ్వీరాజ్, మందడి సంతోష్ రెడ్డి, వర్కాల మొగులయ్య, కొండ మల్లేశం గౌడ్, పోతగాని రామరాజు గౌడ్, బొడ్డుపల్లి మహేష్, కోట సుధాకర్, నారపాక అశోక్, తదితరులు పాల్గొన్నారు.