బీబీనగర్, మే 08 : ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంటి పైకప్పు పెచ్చు ఊడి కిందపడడంతో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామ పంచాయతీలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ బొక్క వసుమతి జైపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరె బొందమ్మ అనే మహిళ గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. తన భర్త, కూతురు, ముగ్గురు మనుమరాళ్లతో కలిసి మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నిద్రించింది.
ఆ సమయంలో ఇంటి పైకప్పు కూలి ఒక్కసారిగా వారిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇళ్లు నాని ఉండడం వల్ల పైకప్పు కూలిందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
Bibi Nagar : ఇంటి పైకప్పు పెచ్చు కూలి ఆరుగురికి గాయాలు
Bibi Nagar : ఇంటి పైకప్పు పెచ్చు కూలి ఆరుగురికి గాయాలు