– జారీ చేసిన కలెక్టర్ హనుమంత రావు
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 18 : అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 19 మందికి అలాగే సమయ పాలన పాటించని 63 మంది యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజు నోటీసులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విధులకు హాజరు కానీ వారిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండడంతో కాంట్రాక్టర్‌పై అలాగే ఆస్పత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంపై సంబంధిత శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డు కలియతిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డులో ఉన్న రోగులతో మాట్లాడి డాక్టర్లు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు
ఎస్ ఎన్ సి యు, పీడియాట్రిక్, పోస్ట్ డెలివరీ, డెలివరీ విభాగాల సిబ్బంది పనితీరును పరిశీలించారు. మేల్, ఫిమేల్ ఇన్ పేషెంట్ వార్డులోని రోగులతో మాట్లాడారు. రోగులకు రోజూ పెట్టే ఆహారంపై ఆరా తీశారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న నలుగురితో మాట్లాడి వైద్య సిబ్బంది సమయానికి వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల డెలివరీ అయిన గర్భిణీలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, చిన్నారులకు టీకాలపై ఆరా తీశారు.
ఎమర్జెన్సీ వార్డులో ఎక్కువ ఏ సమస్య మీద ప్రజలు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఓపి సమయంలో ఎంతమంది డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారని ప్రశ్నించారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు

Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు