
యాదాద్రి: కరోనా వ్యాప్తి కారణంగా మూతబడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30వ తేదీలోగా పాఠశాలలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాల వద్ద గల ప్రభు త్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాల గదులను శానిటైజేషన్ చేసి ఉంచాలన్నారు.
యాదాద్రి అభివృద్ధిలో భాగంగా నిర్మితమవుతున్న రింగురోడ్డు నుంచి పాఠశాల వెళ్లే దారిని వెంటనే పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు అదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రాంగణం పూర్తిగా శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాగౌడ్, మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీ వో ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ అశోక్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మాసాయిపేటను సందర్శించిన అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఉప కేంద్రం, గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక చాలా బాగుందని ప్రశంసించారు. రైతు వేదిక ప్రాంగణం మొత్తం ఒక రెండు నిమిషాలు నిడివి గల వీడియో తీయాలని సూచించారు.
సెప్టెంబర్ 1వ తేది నుంచి పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో పాఠశాలలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. వీటి గురించి తీసుకోవాల్సిన చర్యలపైన ఉపాధ్యాయు లకు తగు సుచనలు చేశారు. పాఠశాల ఆవరణలో ఎక్కడైనా పిచ్చి మొక్కలు ఉంటే వాటిని పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. పాఠశాలలోని వంట గదిని, వంట పా త్రలను జాగ్రత్తగా శుభ్ర పరచాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వంటేరు సువర్ణ, ఎంపీడీవో కారం ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత, పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.
