రాజాపేట ఏప్రిల్ 21 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపంచారు. ప్రజలు కేసీఆర్ను మళ్లీ సీఎంగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గుంటి మధుసూదన్ రెడ్డి, గుంటి కృష్ణ, సంధిల భాస్కర్ గౌడ్, ఎర్రగోగుల జస్వంత్, బెడిద వీరేశం, అంకతి సుదర్శన్, వరుణ్ రమేష్, గజ్జల రాజు, జూకంటి జానకి రాములు, లక్ష్మణ్ నాయక్, తదితరులు ఉన్నారు.