భువనగిరి, జూన్ 18 : యాదాద్రి భువనగిరి జిల్లాకు పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీమ్ కింద 2025-28 సంవత్సరానికి 63 వివిధ నిర్మాణ పనులకు రూ.8.47 కోట్లను రిలీజ్ చేసింది. ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కొత్త పంచాయతీ భవనాల ఏర్పాటు కోసం 10 బిల్డింగ్ లకు రూ. 2 కోట్లు, 26 కొత్త అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ.3.12 కోట్లు, 27 పాఠశాలల ప్రహరీల నిర్మాణం, కాంపౌండ్ కోసం రూ.3.35 కోట్లు విడుదల చేసింది. నిధుల విడుదలపై మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.