ఆలేరు టౌన్, ఆగస్టు 29 : గత రెండు, మూడు రోజులుగా ఆలేరు పట్టణ పరిధిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలైన సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, కుమ్మరివాడ, పెద్దమ్మ వాడ, రంగనాయకుల వీధి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైందని, వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆలేరు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ కు బీజేపీ పట్టణ కమిటీ శుక్రవారం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మురుగు కాలువలు పూర్తిగా నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుందన్నారు.
కాలనీవాసులు సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు నంద గంగేశ్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, వడ్డేమాన్ నరేందర్, కంతల శంకర్, సుంకరి సృజన్, ఎలగల వెంకటేశ్, సుక్క రాజు, గుర్రం నర్సింహులు, తోట మల్లయ్య, తోట వెంకటయ్య, కటకం సత్యనారాయణ, పత్తి రాములు, దయ్యాల కుమార్ పాల్గొన్నారు.