మోత్కూరు, మార్చి 26 : చేనేత కార్మికుల రుణమాఫీలో మిగిలిపోయిన చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేయాలని గురువారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకి తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ్య, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు మాఫీ చేశారే కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాఫీ లిస్టులో రానివారు మిగిలిన వారు దాదాపు 60 మంది ఉన్నట్లు తెలిపారు. వీరికి డిస్ట్రిక్ట్ లీగల్ కమిటీ (డిఎల్సీ) మీటింగ్ పెట్టి అర్హులైన వారికి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జల్ది రాములు, పెండం శ్రీనివాస్ పాల్గొన్నారు.