రామన్నపేట, డిసెంబర్ 26 : రామన్నపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆల్ఫా హై స్కూల్ 1993–96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఉత్సాహభరితంగా, భావోద్వేగంగా కొనసాగింది. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, విద్యార్థి దశలోని అనుభవాలు, గురువుల సహకారం, పాఠశాల జీవితంలోని మధుర క్షణాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాటి గురువులను పూల వర్షంతో, పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. విద్యార్థుల స్వీయ పరిచయంతో ప్రారంభమైన ప్రసంగం జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకునే వేడుకగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆల్ఫా హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సురేశ్, మమతా, అస్మత్ ఉన్నీసా, పూర్వ విద్యార్థులు భవాని, ఉమా, రజిత, వరలక్ష్మి, సర్ద చంద్రశేఖర్, మహమ్మద్ రఫీ, మహమ్మద్ ముస్తాక్ అలీ, తడకమళ్ల చంద్రశేఖర్, రత్న మధు బాబు, పొట్ట రవి, బొల్లం శ్రీనివాస్, శంభాల ఆంజనేయులు, ఎదుగాని మహేందర్, వెంకన్న చారి, గర్దాసు ఉపేందర్, డాక్టర్ కల్యాణ వరప్రసాద్, మందాడి నవీన్ రెడ్డి, చెరుకు ఉపేందర్ పాల్గొన్నారు.