రామన్నపేట, జనవరి 31 : రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం వార్షికోత్సవం, స్పోర్ట్స్ డే, ఫెర్వేల్ డే సెలబ్రేషన్స్‌ను పట్టణంలోని జీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మంచి ఫలితాలను తీసుకురావాలని, క్రమశిక్షణతో జీవితంలో మంచి ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తాసీల్దార్ సి.లాల్ బహదూర్, పట్టణ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్ఐ డి.నాగరాజు, రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ రమేష్, వార్డు మెంబర్లు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ బుంగ సంజీవ్ హాజరయ్యారు. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెల్లంకి వాస్తవ్యులు లక్ష్మీ మురళీధర్ రూ.50 వేల విలువ గల కుర్చీలను కళాశాలకు బహూకరించారు. కళాశాలలో ఏప్రిల్ లో రిటైర్ కాబోతున్న కె.పరమేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసూనాదేవి, పున్నారావు, మాలె వెంకట్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, జి వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, నరసయ్య, యాదయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.

Ramannapet : రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుక
రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాద్యాయులుగా, అధికారులుగా వివిధ పాత్రలు పోషించి అందరిని ఆకట్టుకున్నారు. ఉపాద్యాయులు పాత్రలో తరగతి గదులలో తమ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి, ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె వి ఎన్ ఎస్ మణి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు రషీద్, మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీం, సత్తయ్య, ఉమారాణి, మహాలక్ష్మి, పూనం దాస్, వినోద, లావణ్య, ఫారియా, విజయలక్ష్మి, కరుణ, కళ్యాణి, శ్వేతా, మమత, శ్రీలత, సంధ్య, మాధవి, ఎస్.ఉమారాణి, టి.లావణ్య, రేణుక, కవిత, అనూష, నజియా, సరిత పాల్గొన్నారు.

Ramannapet : రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుక