రాజాపేట, మే 26 : ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన అందుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట ఎంఈఓ చందా రమేశ్ అన్నారు. సోమవారం బడిబాట కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించినట్లు తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేలా, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించనున్నట్లు వెల్లడించారు.
తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి కష్టాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్, ప్రాథమిక హెచ్ఎం సోమ సత్తిరెడ్డి, పాఠశాల చైర్మన్ కలకుంట్ల కవిత, ఉపాధ్యాయులు ఎలగందుల వెంకటేశ్, జూకంటి కరుణాకర్, చిక్క ఉదయ్ కుమార్, చింతకింది శ్రీనివాస్, ఇండ్ల రామచందర్, అంగన్వాడీ టీచర్లు రజిత, సుజాత, మహాలక్ష్మి, జీవనజ్యోతి పాల్గొన్నారు.