సంస్థాన్ నారాయణపురం, జనవరి 24 : తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, S.C.E.R.T తెలంగాణ, భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా TED Ed పోటీలు, ఇంగ్లీష్ ఒలింపియాడ్ నిర్వహించాయి. ఈ పోటీలు పాఠశాల స్థాయి నుండి ప్రారంభమై రాష్ట్ర స్థాయి వరకు కొనసాగాయి. సంస్థాన్ నారాయణపురం మండలంలోని Z.P.H.S పుట్టపాక 9వ తరగతి విద్యార్థులు A.చైతన్య, V.శ్రుతి జిల్లా స్థాయి TED Ed స్టూడెంట్ టాక్‌కి ఎంపికయ్యారు. అక్కడ V.శృతి తన అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయికి చేరుకుంది.
శనివారం జరిగిన పోటీల్లో శృతి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించింది. ఆమె తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులతో పోటీ పడి ఫైనల్ లో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంక్ సాధించింది. పాఠశాల విద్యార్థిని అద్భుత ప్రతిభ పట్ల హెచ్ఎం హన్మంత్, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే పాఠశాల విద్యార్థులు ఇప్పటికే జిల్లా స్థాయి మ్యాథమేటిక్స్, సోషల్ సైన్స్స్ లోనూ తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం.