భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 21 : ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బబ్బురి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం రాయగిరి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.25 వేలు అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, డీఆర్డిఓ నాగిరెడ్డికు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ టి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంకల సిద్దిరాజు, ప్రధాన కార్యదర్శి బైరగోని రమేశ్, కోశాధికారి జెర్రిపోతుల ఉపేందర్, నరేందర్, రామచందర్, బింగి నర్సింహా, రవి, వెంకటేశ్, సుధాకర్, కూమార్, శ్రీను, రజిత, సునీత, వాణి, లక్ష్మి, వివిధ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.