మోటకొండూర్, జూన్ 09 : మోటకొండూర్ మండల కేంద్రానికి సోమవారం ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు ఆ పార్టీ కార్యకర్తలకే వస్తున్నాయని బీఆర్ఎస్ మోటకొండూర్ నాయకులు ఆందోళనకి దిగారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులకు తప్పా బలహీన వర్గాలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏ ప్రభుత్వం పథకం చూసినా వారి పార్టీ వారికే వచ్చినట్లు చెప్పారు. వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని నిలదీశారు.
పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు కలుగజేసుకుని సర్ది చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వాన్ని అభివృద్ధిపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొట్ల నర్సింహ, జీవిలికపల్లి వెంకటేశ్, బాబ్ధ లింగం, బొట్ల పాండు, బొట్ల మహేశ్, బాల ఐలయ్య, దడిగే మధు, నల్ల జహాంగీర్, నక్కిర్త ఉప్పలయ్య, పల్లపు మధు, వంగపల్లి సురేశ్, బొట్ల నవీన్, వడ్డెబోయిన శ్రీనివాస్, బొట్ల ప్రశాంత్, నాంపల్లి బాలకృష్ణ పాల్గొన్నారు.