బీబీనగర్, జూలై 02 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలని ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్టీల్, సిమెంట్ దుకాణదారులు, ఇసుక సరఫరాదారులు, ట్రాక్టర్ యజమానులు, మేస్త్రీలతో సమావేశం నిర్వహించి ధరలను నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్టీల్ దుకాణదారులు, ట్రాక్టర్ యజమానులు, మేస్త్రిలు అందరూ సహకరించి లబ్ధిదారులకు ఖర్చులను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Bibinagar : నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలి : ఎంపిడిఓ శ్రీనివాస్‌రెడ్డి