భువనగిరి అర్బన్: బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపుకు గురవుతున్న ప్రతి కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపుకు గురవు తున్న బీఎన్.తిమ్మాపురం గ్రామస్తులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం అందజేస్తున్న నిధుల గురించి మంగళ వారం వివరించారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామంలో ప్రతి కుటుంబానికి 250 గజాల స్థలం, నష్టపరిహారం కింద ఎనమిది లక్షల పదివేల నగదును అందజేస్తుందని దీంతో గ్రామస్తులు ఇంటి నిర్మాణం చేసుకోవాలని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
ఈ క్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటిని నిర్మించుకునేందుకు స్థలం ఇస్తామని గతంలో అధికారులు చెప్పార ని, ఇండ్ల సర్వే చేపట్టేముందు ప్రభుత్వం తరపున ఇచ్చేవి అన్ని అందజేయాలని అదనపు కలెక్టర్‌కు వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్ కుమార్, తహాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.