ఆత్మకూరు(ఎం), నవంబర్ 04 : ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 20 మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ వర్కర్లకు మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ పోస్టల్ బీమా చేయించారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువైన పోస్టల్ ప్రమాద బీమాను చేయించి బీమా కార్డులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకరమైన వృత్తి చేస్తున్న వర్కర్లకు పోస్టల్ బీమా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ యువజన మండలి సభ్యులతో పాటు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.